Sai Pallavi: సాయిపల్లవి కోసం 'క్యూ' కడుతున్న కథలు!

Sai Pallavi Special

  • నటన...  నాట్యం కలిస్తే సాయిపల్లవి 
  • ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ 
  • యూత్ లోను అదే స్థాయిలో ఫాలోయింగ్ 
  • ఆమె కోసమే కథలు తయారుచేస్తున్న మేకర్స్


సినిమా ప్రపంచం... ఇక్కడ అమ్మ పాత్రను పోషించేవారు కూడా అందంగానే కనిపించాలనే లెక్కలుంటాయి. అలాంటిది హీరోయిన్ గ్లామరస్ గా కనిపించాలని అనుకోకుండా ఎలా ఉంటారు? ఒకవేళ గ్లామరస్ గా కనిపించే ఆలోచన లేకపోతే ఇటువైపు రావడమే అనవసరం అనే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ కారణంగానే నటనను మాత్రమే నమ్ముకుని రావడానికి చాలామంది హీరోయిన్స్ భయపడుతూ ఉంటారు. 

కానీ గ్లామరస్ గానే కాదు... నటన పరంగా కూడా ఆకట్టుకోవచ్చని నిరూపించిన కథానాయికలు ఇక్కడ చాలా తక్కువమంది కనిపిస్తారు. అలాంటివారిలో సౌందర్య, స్నేహ, నిత్యామీనన్ వంటివారి పేర్లు కనిపిస్తాయి. ఆ జాబితాలో ఇప్పుడు వెలిగిపోతున్న పేరే సాయిపల్లవి. ఫ్యామిలీ ఆడియన్స్ ఆమెను ఇప్పుడు ఒక హీరోయిన్ గా చూడటం లేదు... తమ ఇంటి అమ్మాయిగా భావిస్తున్నారు. ఆమె సినిమాలకి కుటుంబ సమేతంగా వెళుతున్నారు. 

నటన పరంగానే కాదు... డాన్స్ పరంగా కూడా సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. మలయాళ, తమిళ, తెలుగు సినిమాల మీదుగా ఆమె ప్రయాణం బాలీవుడ్ వరకూ వెళ్లింది. సాయిపల్లవి ఉంటే ఆ ప్రాజెక్టు క్రేజ్, మార్కెట్ పెరగడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఇక అది లేడీ ఓరియెంటెడ్ కథ అయితే ప్రత్యేకించి చెప్పవలసిన పనేలేదు. అందువల్లనే సాయిపల్లవి కోసం ఇప్పుడు చాలామంది మేకర్స్ వెయిట్ చేస్తున్నట్టు టాక్. 

సాయిపల్లవి చేసే సినిమాలలో సహజంగానే ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ఇక నాయిక ప్రధానమైన పాత్రలలో ఆమె మరింత జీవిస్తుంది. ఎంతటి బలమైన కథనైనా ఆడియన్స్ వరకూ తీసుకుని వెళ్లగలిగే  సత్తా ఆమెకి ఉంది. అందువలన చాలామంది మేకర్స్ ఆమెను దృష్టిలో పెట్టుకుని కథలను తయారుచేసుకుంటున్నారు. ఆ కథలను ఆమెకు వినిపించడం కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారట. ఒకేసారి ఇన్ని భాషల నుంచి ఇంతటి క్రేజ్ ను... డిమాండ్ ను తెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయమే.

Sai Pallavi
Actress
Tollywood
  • Loading...

More Telugu News