: రేపే శ్రీశాంత్ తో పాటు స్పాట్ ఫిక్సర్లు విడుదల
స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ తో పాటు మొత్తం 19 మందికి షరతులతో కూడిన బెయిలు ఢిల్లీ ట్రయల్ కోర్టు మంజూరు చేసింది. శ్రీశాంత్ తో పాటు మిగిలిన 19 మంది రేపు తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే వీరు కోర్టుకు తమ పాస్ పోర్టులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వీరిపై మోకా చట్టం అమలు చేయాలంటూ పోలీసులు కోరినప్పటికీ, మోకా కోర్టు సరైన ఆధారాలను సమర్పించలేదని, దాని కారణంగా బెయిలు మంజూరు చేస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మరో క్రికెటర్ అజిత్ చండీలా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనందున తీహార్ జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది.