Posani Krishna Murali: ఏపీ హైకోర్టులో పోసానికి ఎదురుదెబ్బ

AP High Court dismiss Posani lunch motion petition

  • పోసానిపై సీఐడీ పీటీ వారెంట్ 
  • పీటీ వారెంట్ కొట్టేయాలంటూ హైకోర్టులో పోసాని లంచ్ మోషన్ పిటిషన్ 
  • పోసాని లంచ్ మోషన్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం 

సీఐడీ పీటీ వారెంట్‌కు బ్రేక్ వేయాలన్న పోసాని కృష్ణమురళి ప్రయత్నం విఫలమైంది. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సీఐడీ పీటీ వారెంట్ ను రద్దు చేయాలన్న ఆయన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయంతో పోసాని తీవ్ర నిరాశకు గురయ్యారు. 

పోసానిని ఇప్పటికే పీటీ వారెంట్‌పై కర్నూలులో అదుపులోకి తీసుకున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. ఆయన్ని మంగళగిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి తీసుకువస్తున్నట్టు పీపీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పోసాని పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

Posani Krishna Murali
Lunch Motion Petirion
AP High Court
YSRCP
  • Loading...

More Telugu News