Kodali Nani: ఏపీ హైకోర్టులో కొడాలి నానికి స్వల్ప ఊరట

Kodali Nani gets consolation in AP High Court

  • గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నానిపై ఫిర్యాదు
  • విశాఖ త్రీ టౌన్ పీఎస్ లో కేసు నమోదు
  • కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్
  • నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం

కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు అరెస్ట్ భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు గత నవంబరులో మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 

అయితే, ఈ కేసును కొట్టి వేయాలంటూ కొడాలి నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కొడాలి నానికి స్వల్ప ఊరటనిచ్చింది. తొందరపాటు చర్యలు వద్దని, 35(3) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి వివరాలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News