Meenakshi Govindarajan: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రొమాంటిక్ లవ్ స్టోరీ!

2K love Story Movie Update

  • తమిళంలో రూపొందిన '2k లవ్ స్టోరీ'
  • ఫిబ్రవరి 14న విడుదలైన సినిమా
  • ఈ జనరేషన్ రిలేషన్స్ చుట్టూ తిరిగే కథ  
  • ఈ నెల 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి  


 యూత్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకు తగినట్టుగా లవ్ స్టోరీస్ ఎక్కువగా తెరపైకి వస్తుంటాయి. ఇక 'వాలెంటైన్స్ డే' సందర్భంగా వదలడానికి కొన్ని లవ్ స్టోరీస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. అలా ఈ సారి ఫిబ్రవరి 14వ తేదీన తమిళంలో '2k లవ్ స్టోరీ' విడుదలైంది. 

జగ్ వీర్ - మీనాక్షి గోవిందరాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కోసం కుర్రకారంతా చాలా కుతూహలంతో ఎదురుచూసింది. అయితే రిలీజ్ తరువాత ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫ్లామ్స్ నుంచి పలకరించనుంది. 

ఈ నెల 14వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లోను .. 'ఆహా' తమిళ్ లోను ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ కాలం స్నేహాలు ఎలా ఉన్నాయి? ప్రేమలు .. ఇతర రిలేషన్స్ ఎలా ఉన్నాయి? అనే అంశాల చుట్టూ తిరిగే కథ ఇది. థియేటర్ల నుంచి పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ సినిమా, ఓటీటీ వైవు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందనేది చూడాలి మరి. 

Meenakshi Govindarajan
Jagveer
Susheendran
2K love Story
  • Loading...

More Telugu News