Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఇద్దరి మృతి, 40 మందికి తీవ్ర గాయాలు

Road accident in annamayya district

  • రాయల్పాడు సమీపంలో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఢీ
  • క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన పోలీసులు
  • ఐదుగురి పరిస్థితి విషమం

అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం వేకువజామున ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Road Accident
Annamaiah Dist
Crime News
  • Loading...

More Telugu News