Borugadda Anil: బోరుగడ్డ అనిల్ లొంగిపోవడానికి జైలుకు రాలేదని ఏపీ హైకోర్టుకు తెలిపిన అధికారులు

- నేటి సాయంత్రంతో ముగిసిన మధ్యంతర బెయిల్ గడువు
- గడువులోగా లొంగిపోవడానికి రాని బోరుగడ్డ అనిల్
- తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి కూడా సమాచారమిచ్చిన అధికారులు
వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ గడువు సమయంలో లొంగిపోయేందుకు జైలుకు రాలేదని జైలు అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. అతని మధ్యంతర బెయిల్ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. కానీ గడువులోగా లొంగిపోయేందుకు రాలేదు.
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి కూడా జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. బెయిల్ పొందే సమయంలో బోరుగడ్డకు పూచీకత్తుగా ఉన్న వారి వివరాలను జైలు అధికారులు పోలీసులకు ఇచ్చారు.
తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెబుతూ మధ్యంతర బెయిల్‌ను పొడిగించుకున్నారు. కానీ అనిల్ తల్లికి శస్త్రచికిత్స జరిగినప్పుడు, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పుడు ఆమె వెంట లేడని పోలీసులు నిర్ధారించుకున్నారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి జైలు నుండి బయటకు వచ్చిన బోరుగడ్డ అనిల్... ఆమె వద్ద లేకపోవడంతో ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడనే వివరాలను పోలీసులు సేకరించారు.