Budda Venkanna: కేటీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్

Budda venkanna Fires on  ktr

  • బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడానికి చంద్రబాబుపై వెకిలిగా మాట్లాడటమే కారణమన్న వెంకన్న
  • చంద్రబాబు నాయుడు బ్రాండ్‌తో ఏపీకి పెట్టుబడులు అని వ్యాఖ్య
  • ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో అన్న ఒకే ఒక్క మాటకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్న బుద్దా

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. అఖరికి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణకు రావడం లేదంటూ కేటీఆర్ పెట్టిన ట్వీట్‌పై బుద్దా ఘాటుగా స్పందించారు. 

మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబుపై మీరు వెకిలిగా మాట్లాడడమేనని బుద్దా ఎద్దేవా చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసిన సందర్భంలో, 'ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో నిరసనలు చేసుకోండి' అన్న ఒకే ఒక్క మాటకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్నారు. మీ తండ్రి కేసీఆర్ ఒకసారి చంద్రబాబుకు హిందీ భాష రాదు, ఇంగ్లీషు బాగా రాదు అని మాట్లాడాడని అన్నారు. 'చంద్రబాబు దెబ్బ ఎలా ఉంటుందో ఫార్మ్ హౌస్ లో కూర్చున్న మీ నాన్నను అడుగు' అని అన్నారు.

'పెట్టుబడుల విషయంలో మాట్లాడుతూ అఖరికి ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏమిటి.. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉందని, అది చంద్రబాబు నాయుడు ప్రేరణ అని అన్నారు. నీ నోటి డూల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావ్.. మళ్లీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని జీవితంలో మీ ప్రభుత్వం రాకుండా చేసుకునేలా ఉన్నావ్' అంటూ బుద్దా ఫైర్ అయ్యారు.    

Budda Venkanna
TDP
Vijayawada
KTR
BRS

More Telugu News