Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు

- బెయిల్ మంజూరు చేసిన నరసరావుపేట జిల్లా కోర్టు
- రూ. 10 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన కోర్టు
- గత ఏడాది నవంబరులో నరసరావుపేటలో కేసు నమోదు
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 వేల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో భాగంగా ఆయనను ఈరోజు నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు.
గత ఏడాది నవంబరులో నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోసాని కృష్ణ మురళిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు కొట్టా కిరణ్ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.