Ranganath: అధికారాన్ని అడ్డుపెట్టుకొని భూకబ్జాలకు పాల్పడుతున్నారు: హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదుల వెల్లువ

Complaints to Hydra commissioner about land grabbing

  • హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు
  • రహదారులు, పార్కులను ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదు
  • పాత లేఅవుట్లను చెరిపేసి పొలాలుగా సాగు చేస్తున్నారని ఫిర్యాదులు

హైదరాబాద్‌లో అధికారాన్ని ఉపయోగించి కొందరు నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు లేఅవుట్లలో రహదారుల కబ్జాలు, పార్కుల ఆక్రమణలపై ఫిర్యాదులు చేశారు.

ఈ రోజు మొత్తం 63 ఫిర్యాదులు అందాయి. తుర్కయాంజాల్, ప్రతాపసింగారం, బోడుప్పల్ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ మున్సిపల్ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు కబ్జాలకు పాల్పడుతున్నారని వివిధ ప్రాంతాల ప్రజలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాసు పుస్తకాలను సృష్టించి, పాత లేఅవుట్లను చెరిపేసి పంట పొలాలుగా సాగు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Ranganath
HYDRA
Telangana
  • Loading...

More Telugu News