Virat Kohli: షమీ తల్లి పాదాలకు నమస్కరించిన విరాట్ కోహ్లీ... వీడియో వైరల్

Kohli touched Shami mother feet

 


ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియా సంబరాలు ఓ రేంజిలో కొనసాగాయి. టీమిండియా ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా స్టేడియం అంతా కలియదిరిగారు. 

ఇక, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తల్లి కూడా మైదానంలో అడుగుపెట్టారు. షమీతో కలిసి ఆమె వద్దకు వెళ్లిన విరాట్ కోహ్లీ... ఆమె పాదాలకు నమస్కరించారు. అనంతరం షమీ కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగాడు. వారితో ఆప్యాయంగా ముచ్చటించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

Virat Kohli
Shami
Mother
Dubai
Team India
Champions Trophy 2025

More Telugu News