IPL-18: ఐపీఎల్ నిర్వాహకులకు కేంద్రం కీలక సూచన... ఆ వాణిజ్య ప్రకటనలు వద్దు!

- మార్చి 22 నుంచి ఐపీఎల్-18
- మద్యం, పొగాకు వాణిజ్య ప్రకటనలను నిషేధించాలన్న కేంద్రం
- ఐపీఎల్ నిర్వాహకులకు స్పష్టం చేసిన కేంద్ర వైద్య శాఖ
సిసలైన క్రికెట్ వినోదానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ పోటీలు మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ నిర్వాహకులకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
ఐపీఎల్ లో పొగాకు, మద్యం ప్రకటనలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. టోర్నీలో మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించాలని కేంద్ర వైద్య శాఖ సూచించింది.
కాగా, 10 జట్లు పాల్గొనే ఐపీఎల్ తాజా సీజన్ లో మార్చి 22న జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంప్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.