Jagga Reddy: వెండితెరపై కనిపించనున్న జగ్గారెడ్డి... ఏ సినిమా అంటే...!

- ఏ వార్ ఆఫ్ లవ్ చిత్రంలో ప్రత్యేక పాత్రలో జగ్గారెడ్డి
- వడ్డి రామానుజం దర్శకత్వంలో చిత్రం
- వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్
- తన పాత్ర ఇంటర్వెల్ ముందు వచ్చి, సినిమా చివరి వరకు ఉంటుందన్న జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఏ వార్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ చిత్రానికి వడ్డి రామానుజం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తాను నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు.
ఏ వార్ ఆఫ్ లవ్ చిత్రం వచ్చే ఏడాదికి ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. ఇందులో తన పాత్ర ఇంటర్వెల్ ముందు వస్తుందని, సినిమా ఎండింగ్ వరకు ఉంటుందని వివరించారు. సినిమాలో నటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పర్మిషన్ తీసుకున్నాని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
తాజాగా ఈ సినిమా పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దాంతో, జగ్గారెడ్డి తెరంగేట్రం అంశం హాట్ టాపిక్ గా మారింది.


