Crime News: హైదరాబాదులో ఓ పెళ్లి వేడుకలో దొంగల చేతివాటం

- పెళ్లి వేడుకల్లో ఇంటి యజమాని బిజీగా ఉండగా చోరీ
- ఏడున్నర లక్షల నగలు, నగదు అపహరణ
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాధితుడి ఫిర్యాదు
సందట్లో సడేమియా అన్నట్లుగా పెళ్లి వేడుకలో దొంగలు తమ హస్తలాఘవం ప్రదర్శించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లో నివసిస్తున్న వ్యాపారవేత్త ఇంట్లో దాదాపు ఏడున్నర లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.
ఇంటి యజమాని పెళ్లి వేడుకలో బిజీగా ఉండగా, డ్రెస్సింగ్ రూమ్‌లో తాళం తస్కరించి, దొంగలు తమ చేతివాటం ప్రదర్శించి నగదు, బంగారాన్ని అపహరించారు. దీనిపై ఇంటి పనిమనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.