MLA Quota MLC Election: మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

TDP announces three MLC candidates

  • ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
  • మార్చి 20న పోలింగ్
  • టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 1, బీజేపీకి 1 ఎమ్మెల్సీ స్థానం కేటాయించిన టీడీపీ... మిగిలిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు అభ్యర్థులను ప్రకటించింది. బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడులను టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎస్సీ కాగా, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. 

శ్రీకాకుళంకు చెందిన కావలి గ్రీష్మ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె. ఇక, నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర మొదటి నుంచి పార్టీకి నమ్మకంగా సేవలందిస్తున్నారు. బీటీ నాయుడు కర్నూలు జిల్లా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత.

కాగా, జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవలే నామినేషన్ కూడా వేశారు.

MLA Quota MLC Election
TDP
Chandrababu
Janasena
BJP
  • Loading...

More Telugu News