Rohit Sharma: తొలి వికెట్ కు సెంచరీ పార్టనర్ షిప్... ఫిఫ్టీ కొట్టిన హిట్ మ్యాన్

Rohit Sharma scores fifty as India on winning track
 
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. న్యూజిలాండ్ 252 పరుగుల టార్గెట్ నిర్దేశించగా... టీమిండియా 21 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కీలకమైన టైటిల్ సమరంలో ఫిఫ్టీ సాధించి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళుతుండడం శుభపరిణామం. 

రోహిత్ శర్మ, గిల్ జోడీ తొలి వికెట్ కు 105 పరుగులు జోడించి శుభారంభం అందించింది. గిల్ 31 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. కాసేపటికే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 1 పరుగుకే వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 

ఛేజ్ మాస్టర్ గా పేరొందిన కోహ్లీ... ఈ టోర్నీలో గత మ్యాచ్ ల్లో అద్భుతంగా ఆడి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇవాళ్టి ఫైనల్ సమరంలో అదే ఫామ్ కొనసాగిస్తాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కేవలం 2 బంతులు ఆడిన కోహ్లీ... బ్రేస్ వెల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ 68 బంతుల్లో 71 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడికి జోడీగా శ్రేయస్ అయ్యర్ 5 పరుగులతో ఆడుతున్నాడు.
Rohit Sharma
Team India
New Zealand
Final
Champions Trophy 2025

More Telugu News