SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి... మానవ అవశేషాల గుర్తింపు

- గత నెలలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం
- సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది సిబ్బంది
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- కేరళ డాగ్స్ రాకతో రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి
ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల్లో నేడు పురోగతి కనిపించింది. టన్నెల్ కూలిపోయిన ప్రదేశం వద్ద మానవ అవశేషాలను గుర్తించారు. సొరంగంలో మరింత లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. అయితే, టన్నెల్ లో ఇరుక్కుపోయిన బోరింగ్ మెషీన్ భాగాలు సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారాయి. దాంతో, గ్యాస్ కట్టర్లతో మెషీన్ భాగాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల కేరళ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్లలో తీసుకువచ్చిన కడావర్ డాగ్స్ టీమ్ మానవ అవశేషాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది. కేరళ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో సిబ్బంది తవ్వకాలు జరపనున్నారు.