Amaravati: అమరావతి, శ్రీకాకుళంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు!

International Airports in Amaravati and Srikakulam
  • రాష్ట్రంలో రెండు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు
  • పెట్టుబడుల ఆకర్షణే ప్రభుత్వ లక్ష్యం.
  • ఏపీఏడీసీఎల్ ద్వారా నివేదికల సేకరణ.
  • బిడ్లు దాఖలుకు 32 వారాల గడువు.
  • హైదరాబాద్ అనుభవంతో ప్రభుత్వం నిర్ణయం.
రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, శ్రీకాకుళంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమరావతిలో విమానాశ్రయం ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనివలన ప్రపంచ స్థాయి సంస్థలు నేరుగా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో మరొక విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) సాంకేతిక, ఆర్థిక అంశాలపై నివేదిక కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విమానాశ్రయాల నిర్మాణం కోసం బిడ్లను ఆహ్వానించి, బిడ్లు దాఖలు చేయడానికి 32 వారాల గడువు ఇచ్చింది. విమానాశ్రయాల వలన కలిగే ప్రయోజనాలు, వాణిజ్య అభివృద్ధి అవకాశాలను అంచనా వేయాలని కోరింది. హైదరాబాద్ విమానాశ్రయం అభివృద్ధి చెందిన తరువాత పెట్టుబడులు పెరిగాయని ప్రభుత్వం గుర్తు చేసింది. అమరావతిలో విమానాశ్రయం లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా గుర్తింపు లేదని భావిస్తున్నారు.
Amaravati
Srikakulam
International Airport

More Telugu News