New Delhi: ఢిల్లీ మహిళలకు బీజేపీ ప్రభుత్వం శుభవార్త.. అర్హులైన వారికి నెలకు రూ.2,500

- అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని బీజేపీ హామీ
- మహిళా సమృద్ధి యోజనను త్వరలో అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి
- మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న రేఖా గుప్తా
అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించే మహిళా సమృద్ధి యోజన పథకాన్ని త్వరలో అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. ఎన్నికల సమయంలో అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీని త్వరలో నెరవేరుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఎన్నికల మేనిఫెస్టో హామీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఢిల్లీలో పేద మహిళలకు ఆర్థిక సహాయం పథకాన్ని ఆమోదించినట్లు ఆమె తెలిపారు. ఈ పథకం అమలు పర్యవేక్షణకు తన నేతృత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీలో ఆశిష్ సూద్, పర్వేశ్ శర్మ, కపిల్ మిశ్రా వంటి సీనియర్ మంత్రులు ఉన్నట్లు చెప్పారు. ఈ పథకం కింద పేర్ల నమోదుకు ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని ఆమె తెలిపారు.