Mallu Bhatti Vikramarka: తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలి: ఎంపీల సమావేశంలో భట్టి విక్రమార్క

Mallu Bhattivikramarka meeting with Telangana MPs

  • తెలంగాణ ఎంపీలతో మల్లు భట్టి విక్రమార్క సమావేశం
  • కేంద్రం నుండి రావాల్సిన నిధులపై చర్చ
  • హాజరైన అసదుద్దీన్ ఒవైసీ
  • బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరు
  • కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించుదామన్న భట్టి 

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని ఆయన అన్నారు. ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సి ఉందని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ ఎంపీల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో తాము రాలేమని కిషన్ రెడ్డి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. మల్లు భట్టి విక్రమార్క ఎంపీలందరికీ నిన్ననే ఆహ్వానం పంపించారు.

Mallu Bhatti Vikramarka
Telangana
BRS
Congress
BJP
Bandi Sanjay
  • Loading...

More Telugu News