Techie Roja: విశాఖలో ఎన్నారై టెక్కీ రోజా అనుమానాస్పద మృతి

- అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రోజా
- మిత్రుడు శ్రీధర్ ను కలిసేందుకు విశాఖ వచ్చిన వైనం
- స్నానానికి వెళ్లి ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు తెలిపిన శ్రీధర్
విశాఖలో ఓ ఎన్నారై యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. రోజా అనే యువతి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. తన మిత్రుడు శ్రీధర్ ను కలిసేందుకు ఆమె ఏపీలోని విశాఖపట్నం వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో బస చేసిన ఆమె... స్నానం చేసేందుకు బాత్రూంకి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో శ్రీధర్ ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్ ద్వారా తెలిపాడు.
అయితే ఈ వ్యవహారంలో అనుమానాలున్నప్పటికీ, ప్రాథమికంగా ఆత్మహత్య కేసు నమోదు చేసినట్టు విశాఖ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రోజా స్నేహితుడు శ్రీధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.