Actress Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కేసు.. సినీ నటి రన్యారావుకు డీఆర్ఐ కస్టడీ

DRI custody to actress Ranya Rao

  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి రన్యారావు కేసు
  • దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడిన వైనం
  • ఆమె నుంచి 14.2 కేజీల బంగారు బిస్కెట్లు, 2 కోట్ల విలువైన వజ్రాలు, రూ. 2.67 కోట్ల విలువైన నగదు స్వాధీనం
  • బెయిలు పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం

దుబాయ్ నుంచి బంగారు బిస్కెట్లు తీసుకొస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన సినీ నటి రన్యారావు (34)ను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిన్న ఆదేశాలు జారీచేసింది. రన్యారావు నుంచి డీఆర్ఐ అధికారులు ఇప్పటి వరకు 14.2 కేజీల బంగారు బిస్కెట్లు, రూ. 2.06 కోట్ల విలువైన వజ్రాలు, రూ. 2.67 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. 

రన్యారావు గత ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్ వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. అలాగే, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలకు కూడా ప్రయాణించినట్టు తేలింది. అంతేకాదు, రన్యారావుకు సంఘ విద్రోహ శక్తులతోనూ సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఆ కోణంలోనూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. 

కాగా, బెయిలు కోసం ప్రత్యేక న్యాయస్థానంలో ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. కాగా, కర్ణాటక డీజీపీ డాక్టర్ కె.రామచంద్రరావు నటి రన్యారావుకు సవతి తండ్రి. రన్యాకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్లయ్యాక భర్తతో కలిసి ఉంటోందని, వారు ఏం చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని ఇటీవల ఆయన చెప్పారు.

Actress Ranya Rao
DRI
Karnataka
  • Loading...

More Telugu News