Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కొత్త యాడ్ కు విశేష స్పందన

jr ntr ad video viral in social media

  • అనేక టాప్ బ్రాండ్లకు ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్
  • తాజాగా జెప్లో కంపెనీ ఆన్ లైన్ బిజినెస్ యాడ్‌లో తారక్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ జెప్టో సూపర్ సేవర్ యాడ్
  • ఫ్రిజ్, వాషింగ్ మిషన్‌లో కనిపించిన ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో 'వార్ 2' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమాలు, వాణిజ్య ప్రకటనలతో నిత్యం బిజీగా ఉండే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ అనేక ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుండగా, ఆయన నటించిన ఏదో ఒక యాడ్ టీవీ ఛానల్‌లో తరచుగా ప్రసారమవుతూనే ఉంటుంది.

తాజాగా ఎన్టీఆర్ ఒక కొత్త యాడ్‌లో నటించారు. నిత్యావసర సరుకులు సరఫరా చేసే ఆన్‌లైన్ బిజినెస్ సంస్థ జెప్టో కోసం ఎన్టీఆర్ ఈ యాడ్ చేశారు. ఇందులో "ఇది జెప్టో సూపర్ సేవర్ అండీ, ధరలు చాలా తక్కువ..ఒకసారి చూసేయండి" అని ఆయన చెప్పినట్లు వీడియోలో చూపించారు. అంతేకాదు, ఎన్టీఆర్ ఫ్రిజ్‌లో కూర్చుని, వాషింగ్ మెషీన్‌లో ఉన్నట్లు కూడా సరదాగా చూపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఈ కొత్త యాడ్‌ను వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన ఈ కొత్త యాడ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 

More Telugu News