Charlapalli Railway Station: చర్లపల్లి నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లు

Two Trains Are Now Begin From Cherlapalli

     


హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి నడిచే రెండు రైళ్ల ప్రారంభ స్థానాన్ని మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603), హైదరాబాద్-చెన్నై సెంట్రల్ (12604), గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ (12589), సికింద్రాబాద్- గోరఖ్‌పూర్ (12590) రైళ్లు ఇకపై చర్లపల్లి కేంద్రంగా నడవనున్నాయి.

దీంతో ఈ రైళ్లను ఇకపై చెన్నై సెంట్రల్-చర్లపల్లి, చర్లపల్లి-చెన్నై సెంట్రల్, గోరఖ్‌పూర్-చర్లపల్లి, చర్లపల్లి-గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా వ్యవహరిస్తారు. చర్లపల్లి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు నిన్నటి నుంచే చర్లపల్లి నుంచి ప్రయాణం ప్రారంభించగా, గోరఖ్‌పూర్ నుంచి చర్లపల్లి, చర్లపల్లి నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైళ్ల విషయంలో మాత్రం 12, 13వ తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News