Mallu Bhatti Vikramarka: బకాయిల కోసం సచివాలయం చుట్టూ తిరగొద్దు: ఉద్యోగుల జేఏసీతో భట్టి విక్రమార్క

Bhatti Vikramarka held meeting with Employees JAC

  • ఉద్యోగుల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం
  • తమ డిమాండ్లను భట్టి ముందుంచిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు
  • రూ.8 వేల కోట్ల బకాయిలను క్రమపద్ధతిలో చెల్లిస్తామని భట్టి హామీ
  • ఏప్రిల్ నుంచి నెలకు రూ.600 కోట్లు చెల్లిస్తామని వెల్లడి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఉద్యోగుల జేఏసీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు పలు డిమాండ్లను వినిపించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. పెండింగ్ డీఏలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. 

దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ... పెండింగ్ బిల్లుల కోసం సచివాలయం చుట్టూ తిరగొద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులకు బకాయిలను క్రమపద్ధతిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రూ.8 వేల కోట్ల బకాయిలను క్రమపద్ధతిలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ మాసం నుంచి ప్రతి నెలా రూ.600 కోట్లు చెల్లిస్తామని చెప్పారు.

Mallu Bhatti Vikramarka
Employees JAC
Pending Bills
Telangana
  • Loading...

More Telugu News