AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ప్రతిపాదనలకు ఆమోదం

AP Cabinet meeting concluded

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
  • పవన్, లోకేశ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు
  • పంచాయతీ రాజ్ శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ మంత్రివర్గ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర శాఖల మంంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కీలక బిల్లులు, ప్రతిపాదనల గురించి ఈ కేబినెట్ భేటీలో చర్చించారు. 

ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వైద్య ఆరోగ్య శాఖలో ప్రతిపాదనలకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. 372 సివిల్ సర్జన్ పోస్టులు భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించగా... మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఇక, మద్యం దుకాణాల్లో సొండి కులాలకు 4 దుకాణాలు కేటాయించాలన్న నిర్ణయానికి కూడా ఆమోదం లభించింది. కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఆమోదం పొందిన ఇతర నిర్ణయాలు ఇవే...
  • రాజమండ్రిలో అగ్రికల్చర్ కాలేజి ఏర్పాటుకు ఉచిత భూ కేటాయింపు
  • రాజమండ్రిలో ఓల్డ్ హేవ్ లాక్ బ్రిడ్జి అభివృద్ధికి 116 ఎకరాల భూమి కేటాయింపు
  • టూరిజం ల్యాండ్ అలాట్ మెంట్ పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం
  • సీతంపేట ఎంఎస్ఎంఈ పార్కుకు ఉచిత భూ కేటాయింపు
  • డీపీవోల క్యాడర్ క్రమబద్దీకరణపై ప్రతిపాదనలకు ఆమోదం
  • పౌర సేవలు ప్రజలకు నేరుగా అందేలా కేడర్లో మార్పులకు ఆమోదం

AP Cabinet
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News