Paper Leak: నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్

ANU BEd question paper leaked out

  • నాగార్జున వర్సిటీ పరిధిలో బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు
  • ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష
  • పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ 

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఎడ్ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ అయింది. బీఎడ్ మొదటి సెమిస్టర్ కు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా... పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయింది. కాలేజీల యాజమాన్యాలే పేపర్ లీక్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అయితే, దీనిపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సుబ్బారావును మీడియా వివరణ కోరగా... పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు సీడీ ద్వారా పేపర్ రిలీజ్ చేశారని, అది బయటికి ఎలా లీకైందో తెలియదని బదులిచ్చారు. 

కాగా, నిన్న జరిగిన పరీక్షలోనూ క్వశ్చన్ పేపర్ అరగంట ముందే బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.

Paper Leak
BEd
Nagarjuna University
  • Loading...

More Telugu News