SpaceX Rocket: ఆకాశంలో పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్.. వీడియో ఇదిగో!

SpaceX Starship explodes in space

  • టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా స్టార్‌షిప్ మెగా రాకెట్ ప్రయోగం
  • తొలుత విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
  • ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోయిన వైనం

ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ప్రయోగించిన స్టార్‌షిప్ మెగా రాకెట్ అంతరిక్షంలో పేలిపోయింది. ప్రయోగం విజయవంతమైనా ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోయి చెల్లాచెదురైంది. టెక్సాస్‌లోని బొకాచికాలో నిన్న సాయంత్రం 5.30 గంటలకు స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించారు. తొలుత రాకెట్ విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోయింది. దాని నుంచి భారీ శకలాలు కిందికి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకాలాలు నిప్పులు కక్కుతూ రాలడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

దీనిపై స్పేస్‌ఎక్స్ స్పందించింది. వీటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. కాగా, స్పేస్ఎక్స్ జనవరిలో నిర్వహించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగం కూడా విఫలమైంది. సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగినట్టు అప్పట్లో స్పేస్ఎక్స్ ప్రకటించింది.

SpaceX Rocket
SpaceX Rocket Derbis
USA
Elon Musk

More Telugu News