YS Jagan: విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీపై హైదరాబాద్ ట్రైబ్యునల్‌లో జగన్ పిటిషన్

- తమ షేర్లను విజయమ్మ, షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని పిటిషన్
- కనీసం తన సంతకాలు లేకుండా షేర్ల బదిలీ జరిగిందని పేర్కొన్న జగన్
- ప్రతివాదులుగా విజయమ్మ, షర్మిల, సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్
తన పేరు మీద, వైఎస్ భారతి పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
కనీసం తన సంతకాలు లేకుండా షేర్ల బదిలీ జరిగిందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయమ్మ, షర్మిల, సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
బదిలీ చేసుకున్న షేర్లపై స్టే విధించాలని గత వారం జగన్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. తాజా పిటిషన్‌తో పాటు మధ్యంతర పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి వాద, ప్రతివాదులు గడువు కోరడంతో తదుపరి విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడింది.