Chandrababu: వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు: చంద్రబాబు

Chandrababu praises Venkaihnaidu

  • దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ
  • విశాఖలో కార్యక్రమం
  • హాజరైన చంద్రబాబు

దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన 'ప్రపంచ చరిత్ర' పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు తన ప్రసంగంలో వెంకయ్యనాయుడు గురించి ప్రస్తావించారు. 

"1978లో నేను, వెంకయ్య నాయుడు ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలిచాం. అప్పటికీ ఇప్పటికీ ఆయన పవర్ తగ్గలేదు... పంచులు పెరుగుతున్నాయి. ఎప్పుడూ అచ్చతెలుగులో మాట్లాడుతుంటారు. చిన్న కుటుంబంలో పుట్టి అంచలంచలుగా ఎదిగి ఉపరాష్ట్రపతి అయ్యారు" అని వివరించారు. 

"గీతం యూనివర్సిటీని గత ప్రభుత్వ హయాంలో కూల్చాలని చూశారు. ఎంవీవీస్ మూర్తి ఒక చరిత్ర సృష్టించారు. గీతం యూనివర్సిటీని ఎందుకు నెలకొల్పాల్సి వచ్చిందని ఒకసారి అడిగాను. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో మా రెండో అబ్బాయికి సీటు ఇవ్వలేదు... అందుకే వారికంటే మంచి విద్యా వ్యవస్థను పెడతాను అని ఛాలెంజ్ చేసి గీతం యూనివర్సిటీని పెట్టానని ఆయన నాకు చెప్పారు"’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Chandrababu
Venkaiah Naidu
Daggubati Venkateswararao
  • Loading...

More Telugu News