Stock Market: 609 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Markets ends in profits

  • వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 207 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4.70 శాతం పెరిగిన ఏషియన్ పెయింట్స్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లలో జోష్ నెలకొంది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 609 పాయింట్ల లాభంతో 74,340 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పెరిగి 22,544 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి రూ. 87.12 వద్ద ముగిసింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏషియన్ పెయింట్స్ (4.70%), ఎన్టీపీసీ (3.41%), రిలయన్స్ (2.96%), టాటా స్టీల్ (2.87%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.39%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.31%), కోటక్ బ్యాంక్ (-0.96%), జొమాటో (-0.62%), టాటా మోటార్స్ (-0.19%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.07%).

Stock Market
Sensex
Nifty
  • Loading...

More Telugu News