Ashika Ranganath: అందం ఉంది... అలాంటి పాత్ర మళ్లీ ఒకటి పడాల్సిందే!

Ashika Ranganath Special

  • కన్నడ నుంచి వచ్చిన ఆషికా రంగనాథ్ 
  • నాజూకు సుందరిగా యూత్ లో క్రేజ్ 
  • తెలుగులో హిట్ కొట్టిన 'నా సామిరంగ'
  • చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టులు 
  • సరైన హిట్ కోసమే వెయిటింగ్  


తెలుగు తెరకి నాజూకైన అందాన్ని పరిచయం చేసిన అతి కొంతమంది కథానాయికలలో ఆషికా రంగనాథ్ ఒకరు. తమలపాకు లాంటి కోమలత్వానికి ఆమె కొలమానంగా కనిపిస్తుంది. కాలేజ్ చదువు పూర్తి కాగానే ఈ కన్నడ బ్యూటీ 2016లో ఓ కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పాలరాతి శిల్పానికి ప్రాణం పోసినట్టుగా ఉన్న ఈ సౌందర్యరాశికి అక్కడి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. దాంతో అక్కడ ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.కన్నడలో ఆషికా చాలామంది కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది. దాంతో తెలుగు, తమిళ భాషల నుంచి కూడా అవకాశాలు రావడం మొదలైంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో చేయడం మొదలుపెట్టింది. అయితే తెలుగులో చేసిన 'నా సామిరంగ' మాత్రమే చెప్పుకోదగిన హిట్ గా నిలిచింది. ఆమె అందచందాలకు... హావభావాలకు ఇక్కడి కుర్రాళ్లు కూడా గతంలోని తమ ఫేవరెట్ హీరోయిన్స్ ను మరిచిపోయారు.'నా సామిరంగ' హిట్ తరువాత ఈ సుందరి జోరు పెరుగుతుందని చాలామంది అనుకున్నారు... కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో కన్నడ మూవీ 'గతవైభవ' ఉంది. అలాగే తమిళంలో కార్తి జోడీగా చేసే 'సర్దార్ 2' ఉంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఆమె కెరియర్ కి కొంతకాలం పాటు ఢోకా ఉండదనే చెప్పాలి. తెలుగులో 'విశ్వంభర' చేస్తున్నప్పటికీ, ఆ పాత్రకి గల ప్రాధాన్యత ఏమిటనేది తెలియదు. అందువలన 'నా సామిరంగ' సినిమాలో వంటి పాత్ర మరొక్కటి పడితే ఈ బ్యూటీ గ్రాఫ్ పుంజుకుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News