Hyderabad: హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామంటూ మోసం... నకిలీ కాల్ సెంటర్ యజమాని అరెస్ట్

- హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన మహిళ
- అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్న ముఠా
- 60 మందిని అరెస్టు చేసిన పోలీసులు
నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ప్రధానంగా అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతోంది. ఈ కేసులో 60 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన మనస్విని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో 'ఎక్సిటో సొల్యూషన్స్' పేరిట కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ అనే వ్యక్తుతో కలిసి ఈ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొంతమందిని టెలీకాలర్లుగా నియమించుకుంది.
అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని నిందితులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు వీరి నుండి 63 ల్యాప్‌టాప్‌లు, 52 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరి చేస్తామంటూ వీరు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను సేకరించి వారి ఖాతాల్లోని నగదును కాజేస్తున్నారు.