Gorantla Madhav: పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్

- పోక్సో కేసులోని బాధితుల పేర్లను వెల్లడించారంటూ గోరంట్ల మాధవ్ పై కేసు
- మాధవ్ పై ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి పద్మ
- విచారణ అనంతరం మాధవ్ స్టేట్మెంట్ ను నమోదు చేయనున్న పోలీసులు
పోక్సో చట్టం కేసులో ఉన్న అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేశారనే కేసులో విజయవాడ క్రైమ్ పోలీసుల విచారణకు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. ఆయన ముందు విచారణాధికారులు 10 ప్రశ్నలను ఉంచినట్టు సమాచారం. విచారణ అనంతరం మాధవ్ స్టేట్మెంట్ ను పోలీసులు నమోదు చేయనున్నారు.
ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల వివరాలను వెల్లడించారంటూ మాధవ్ పై గత ఏడాది నవంబర్ 2న ఆమె ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమ విచారణకు హాజరు కావాలంటూ విజయవాడ క్రైమ్ పోలీసులు మాధవ్ కు నోటీసులు అందించారు. ఈ క్రమంలో ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు. పోలీసు విచారణకు తాను సహకరిస్తానని నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.