Konda Surekha: పెంపుడు కుక్క మృతితో కన్నీటి పర్యంతమైన మంత్రి కొండా సురేఖ... వీడియో ఇదిగో!

Konda Surekha mourns to the death of their pet dog
 
తెలంగాణ మంత్రి కొండా సురేఖ విషాదానికి గురయ్యారు. ఆమె నివాసంలో పెంపుడు కుక్క మృతి చెందడమే అందుకు కారణం. హ్యాపీ అనే పేరు గల ఆ శునకం హార్ట్ ఫెయిల్యూర్ తో ప్రాణాలు విడిచింది. తమ ఇంట్లో ఒకరిగా కలిసిపోయిన ఆ శునకం విగతజీవురాలిగా పడి ఉండడాన్ని మంత్రి కొండా సురేఖ చూసి తట్టుకోలేకపోయారు. భోరున విలపించారు. కుక్క మృతదేహంపై పూలు చల్లి నివాళి అర్పించారు. అనంతరం దానికి అంతిమసంస్కారాలు నిర్వహించారు.
Konda Surekha
Pet Dog
Death

More Telugu News