Narendra Modi: కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధాని మోదీ అభినందన

Modi congratulates MLC election winners

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా
  • ఎమ్మెల్సీలుగా గెలిచిన కొమరయ్య, అంజిరెడ్డిలకు మోదీ అభినందన
  • తమ పార్టీ కార్యకర్తలను చూసి గర్విస్తున్నానన్న మోదీ

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజతకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో మమేకమై పనిచేస్తున్న తమ పార్టీ కార్యకర్తలను చూసి గర్విస్తున్నానని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై నేతలు దృష్టి సారిస్తున్నారు.

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు కూడా మోదీ అభినందనలు తెలిపారు. కేంద్రంలోను, ఏపీలోను ఎన్డీయే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళతాయని అన్నారు.

Narendra Modi
BJP

More Telugu News