Ganguly: వెబ్ సిరీస్ లో మాజీ క్రికెటర్ అతిథి పాత్ర!

Sourav Ganguly ventures into acting with Netflixs Khakee 2

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న గంగూలీ పిక్చర్
  • ఈ నెల 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘ఖాకీ’ స్ట్రీమింగ్
  • ఐపీఎస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా నిర్మాణం

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారా అంటే అవుననే జవాబు వస్తోంది. తాజాగా స్ట్రీమింగ్ కు సిద్ధమైన ‘ఖాకీ’ అనే వెబ్ సిరీస్ లో గంగూలీ అతిథి పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. పోలీస్ యూనిఫాంలో ఉన్న గంగూలీ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఈ విషయంపై వెబ్ సిరీస్ నిర్మాత నీరజ్ పాండే సూటిగా జవాబివ్వలేదు. ఈ నెల 20న స్ట్రీమింగ్ కానున్న ఖాకీ వెబ్ సిరీస్ చూస్తే గంగూలీ ఇందులో నటించారా? లేదా? అనేది తెలుసుకోవచ్చంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. అయితే, వెబ్ సిరీస్‌ ప్రచారంలో భాగంగా గంగూలీ పోలీస్ యూనిఫామ్‌ ధరించి ఉంటారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సౌరభ్‌ గంగూలీ బయోపిక్‌ సినిమా కోసం కొన్నేళ్లుగా స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే రాజ్‌కుమార్‌రావును హీరోగా ఖరారు చేసినట్లు సమాచారం.

‘ఖాకీ ది బిహార్‌ చాప్టర్‌’కు కొనసాగింపుగా జీత్‌, ప్రోసెన్‌జిత్‌ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో ‘ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌’ (ఖాకీ 2) సిరీస్ ను తెరకెక్కించినట్లు పాండే తెలిపారు. బుధవారం జరిగిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ లో ఆయన మాట్లాడుతూ..ఐపీఎస్ అధికారి అమిత్ లోథా తన వృత్తి జీవితంలో ఎదురైన సంఘటనలను ‘బిహార్ డైరీస్’ పేరుతో అక్షరీకరించారు. దీని ఆధారంగా ‘బిహార్‌ చాప్టర్‌’ను తెరకెక్కించినట్లు నీరజ్ పాండే వివరించారు. 2022లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయగా ప్రేక్షకాదరణ పొందిందని తెలిపారు. ఈ సిరీస్ కు కొనసాగింపుగా తాజాగా ఖాకీ 2 రూపొందించినట్లు వివరించారు.

  • Loading...

More Telugu News