AP Capital Amaravati: సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దు: మంత్రి నారాయణ

- అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణ
- అధికారంలో ఉన్నప్పుడు మూడు ముక్కలాట ఆడారని విమర్శలు
- అమరావతి నిర్మాణంలో ప్రజలపై ఒక్క పైసా భారం పడదని స్పష్టీకరణ
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలపై ఒక్క పైసా భారం ఉండదని మంత్రి నారాయణ స్పష్టంచేశారు.
ప్రపంచంలోని టాప్-5 సిటీల్లో అమరావతిని నిలబెట్టడమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధానికి సంబంధించి రూ.64 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని వెల్లడించారు.