TG Cabinet: నేడు రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana cabinet meeting today

  • మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ
  • ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్
  • బీసీ రిజర్వేషన్లు పెంచే బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

ఈరోజు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఈ సమావేశంలో ఆమోదిస్తారు. అలాగే బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే తేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వీటితో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేస్తారు. 

TG Cabinet
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News