Supreme Court: ట్రంప్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

supreme court rejects trumps request to keep billions in foreign aid frozen

  • యూఎస్ ఎయిడ్ నిలుపుదల విషయంలో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సమర్దించిన సుప్రీంకోర్టు
  • ఎటువంటి చర్యలు తీసుకోవాలో ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలని స్పష్టీకరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు యూఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా అందుతున్న నిధులను ట్రంప్ సర్కార్ స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై స్టే విధిస్తూ ఇటీవల ట్రైయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. తాత్కాలిక నిషేధ ఉత్తర్వులను పొడిగించడానికి గడువు ఇప్పటికే ముగిసినందున ఎటువంటి చర్యలు తీసుకోవాలో ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలని వైట్‌హౌస్‌కు సూచించింది. ఈ తీర్పుతో నిధుల విడుదలకు అనుమతి లభించినప్పటికీ దీనికి సరైన కాలపరిమితిని నిర్ణయించలేదు. దీంతో ట్రంప్ సర్కార్ దిగువ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. 

కాగా, వివిధ దేశాల్లోని పలు సంస్థలకు ఆర్ధిక సాయం అందించే యూఎస్ ఎయిడ్ (యూఎస్ఏఐడీ) సంస్థ ద్వారా అందుతున్న నిధులను స్తంభింపజేస్తూ ట్రంప్ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఎన్జీవోలు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఫెడరల్ జడ్జి అమీర్ అలీ ట్రంప్ సర్కార్ ఉత్తర్వులపై తాత్కాలికంగా స్టే ఇచ్చారు. తన ఉత్తర్వులు అమలు చేస్తున్నదీ లేనిదీ ఐదు రోజుల్లో తెలపాలని ట్రంప్ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జడ్జి అమీర్ ఆలీ ఇచ్చిన ఉత్తర్వులను 5-4 మెజార్టీతో సుప్రీం ధర్మాసనం సమర్ధించింది.  

  • Loading...

More Telugu News