Nadendla Manohar: నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా?: జగన్ వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల కౌంటర్

Nadendla counters Jagan remarks on Pawan Kalyan

  • పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ... ఎమ్మెల్యేకు తక్కువ అన్న జగన్
  • జగన్ ను తాము కూడా అనగలమని వార్నింగ్ ఇచ్చిన నాదెండ్ల
  • నోరుంది కదా అని ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదని హితవు

11 సీట్లు వచ్చిన వాళ్లకు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం బెటర్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం... పవన్ కార్పొరేటర్ కు తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని జగన్ ఇవాళ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, జగన్ కామెంట్స్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. క్రిమినల్ మైండ్ తో వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని విమర్శించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్ ను విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 

"నువ్వు కోడికత్తికి ఎక్కువ... గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా! నోరుంది కదా అని వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు" అంటూ నాదెండ్ల ధ్వజమెత్తారు. 

ఇక జగన్ ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అంటూ నాదెండ్ల ఎద్దేవా చేశారు. 

"సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకు రాడు... తరచుగా బెంగళూరుకు వెళుతుంటాడు. మీరు ఏ విధంగా ప్రజా సమస్యలపై నిలబడతారో చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు... ఆ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి కదా" అంటూ నాదెండ్ల వ్యాఖ్యానించారు.

Nadendla Manohar
Jagan
Pawan Kalyan
Janasena
YSRCP
  • Loading...

More Telugu News