Canada: అమెరికాకు కెనడా వార్నింగ్

Canada warning to USA

  • కెనడాపై 25 శాతం సుంకం విధించిన ట్రంప్
  • మస్క్ కు చెందిన స్టార్ లింక్ తో డీల్ రద్దు చేశామన్న డగ్ ఫోర్డ్
  • అమెరికా కూడా నొప్పి అనుభవించాలని వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా ట్రంప్ అందరిపై భారీ సుంకాలు విధిస్తున్నారు. తమ పొరుగు దేశం కెనడాపై కూడా 25 శాతం సుంకం విధించారు. ఈ నేపథ్యంలో కెనడా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్ లింక్ తో ఉన్న 100 మిలియన్ డాలర్ల డీల్ ను రద్దు చేస్తున్నట్టు ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ప్రకటించారు.

తాము ఆర్థికంగా దెబ్బతినేలా చేస్తామంటే చూస్తూ కూర్చోబోమని డగ్ ఫోర్డ్ అన్నారు. ఒంటారియోను ధ్వంసం చేస్తామంటే చూస్తూ కూర్చోనని... చిరునవ్వుతో చేయాల్సిందంతా చేస్తానని చెప్పారు. ఒంటారియాతో స్టార్ లింక్ కు ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దుచేయడం పూర్తయిందని తెలిపారు. తమ స్టోర్ల నుంచి అమెరికా ఆల్కహాల్ ను తొలగించాలని యోచిస్తున్నామని చెప్పారు. స్టార్ లింక్ డీల్ కింద తొలుత 15 వేల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు ఇంటర్నెట్ సదుపాయం అందించాల్సి ఉంది. 

చిరకాల మిత్ర దేశమైన కెనడాపై ట్రంప్ సుంకాలు ఎందుకు విధిస్తున్నారని డగ్ ఫోర్డ్ ప్రశ్నించారు. అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనడా నుంచే వెళుతున్నాయని, వారు తమ ఇంధనంపై ఆధారపడి ఉన్నారని, వాళ్లు కూడా నొప్పి అనుభవించాలని అన్నారు. సన్నిహిత మిత్రులు, పొరుగు వారిపై ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. కెనడాపై సుంకం విధించడం అంటే అమెరికన్లపై పన్ను విధించడం కిందకే వస్తుందని అన్నారు.  

Canada
USA
  • Loading...

More Telugu News