Dil Raju: నిర్మాతల కష్టాన్ని హీరోలు పట్టించుకోవట్లేదంటూ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

Producer Dil Raju Sensational Comments On Heros

  • పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడి
  • ప్రొడ్యూసర్ నష్టపోతే మాకేంటనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • హీరోలు, ఆర్టిస్టులు మరో ప్రాజెక్టులో బిజీగా ఉంటున్నారని వివరణ

సినిమా పైరసీకి గురైతే నిర్మాత తీవ్రంగా నష్టపోతుండగా.. హీరోలు, ఇతర ఆర్టిస్టులు మాత్రం తమకేమిటన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ధోరణి సరికాదని అభిప్రాయపడ్డారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ సందర్భంగా దిల్ రాజు బుధవారం మీడియాతో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీని పైరసీ సమస్య తీవ్రంగా వేధిస్తోందని చెప్పారు. సినిమా పైరసీకి గురైతే నిర్మాత మాత్రమే నష్టపోతున్నాడని, హీరోలు సేఫ్ గా ఉంటున్నారని విమర్శించారు.

నిర్మాత కష్టాన్ని పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్టులో బిజీగా మారిపోతున్నారని అన్నారు. నిర్మాత నష్టపోతే మాకేంటనే ధోరణి సరికాదని, తమ వరకు వస్తే కానీ నొప్పి తెలియదని అన్నారు. త్వరలోనే ఈ విషయంపైనా మీటింగ్ పెట్టుకుంటామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌‌‌‌ గానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్(టీఎఫ్‌‌డీసీ) చైర్మన్‎గా పైరసీపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించినట్లు దిల్ రాజు వెల్లడించారు. ఈ విషయంపై ప్రభుత్వానికి త్వరలో లేఖ రాయనున్నట్లు దిల్ రాజు వివరించారు.

  • Loading...

More Telugu News