Samantha: మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలపై సమంత స్పందన

- మళ్లీ ప్రేమలో పడాలని ఎప్పుడూ ఆలోచించలేదన్న సమంత
- ప్రేమ గురించి చర్చించాలని లేదని వ్యాఖ్య
- అది తన వ్యక్తిగత విషయమన్న సామ్
స్టార్ హీరోయిన్ సమంత... నాగ చైతన్య నుంచి విడిపోయి ఒంటరిగా గడుపుతున్న సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. తన ఆరోగ్యం కోసం ఎంతో పోరాడిన సామ్ ఆ వ్యాధిని జయించి సాధారణ స్థితికి వచ్చింది. ప్రస్తుతం ఆమె తన సినీ కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. మరోవైపు సమంత మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జీవితంలో మళ్లీ ప్రేమలో పడాలని ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది. ప్రేమ గురించి చర్చించాలని కూడా తనకు లేదని తెలిపింది. ప్రేమ అనేది తన వ్యక్తిగత విషయమని, దాన్ని వ్యక్తిగతంగానే ఉంచుతానని చెప్పింది. సమంత చెప్పినదాన్ని బట్టిచూస్తే... మరోసారి ప్రేమలో పడాలనే ఉద్దేశం ఆమెకు లేదనే విషయం స్పష్టమవుతోంది.