Larence: 'కాంచన 4'... ఈ సారి అంతకుమించి!

Kanchana 4 Movie Update

  • 2011లో వచ్చిన 'కాంచన' సూపర్ హిట్ 
  • 2015లో విడుదలైన 'కాంచన 2' బ్లాక్ బస్టర్ హిట్ 
  • 120 కోట్ల వరకూ వసూలు చేసిన సినిమా ఇది 
  • 65 కోట్లతో నిర్మితమవుతున్న 'కాంచన 4'


తమిళంలో ఒకప్పుడు కూడా హారర్ కామెడీ సినిమాలు వచ్చాయి. అయితే ఆ జోనర్ ను టచ్ చేసిన లారెన్స్ తనదైన మార్క్ చూపించాడు. భయాన్ని .. కామెడీని తగిన మోతాదులో కలపడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. లారెన్స్ కి అంతకుముందు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ, 'కాంచన' సిరీస్ ఆయనను దర్శక నిర్మాతగా నిలబెట్టేసింది. 2011లో 'కాంచన' సినిమాను కేవలం 7 కోట్లతో నిర్మించిన లారెన్స్, ఆ తరువాత నుంచి ఈ సిరీస్ నిర్మాణానికి బడ్జెట్ ను పెంచుతూ వెళుతున్నాడు. 

'కాంచన' సిరీస్ లో లారెన్స్ కి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిందిగా 'కాంచన 2' కనిపిస్తుంది. తాప్సి కథానాయికగా నటించిన ఈ సినిమాను లారెన్స్ 17 కోట్లతో నిర్మించగా, 120 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమయితే మంచి రేటింగ్ వస్తుంది. 'కాంచన 3' విషయానికి వస్తే వసూళ్లు పెద్దగా తగ్గలేదు గానీ, కంటెంట్ కాస్త వీక్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో లారెన్స్ కాస్త గ్యాప్ తీసుకుని 'కాంచన 4'ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాడు.  

'కాంచన 4' సినిమా కోసం లారెన్స్ 65 కోట్లను కేటాయించడం విశేషం. ఖర్చు పరంగానే కాదు, వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా తన కెరియర్ లోనే భారీ చిత్రంగా నిలిచిపోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఇక కంటెంట్ పరంగా కూడా గతంలో వచ్చిన మూడు భాగాలకు మించి అన్నట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే 'బధిర' యువతిగా కనిపించనుందని అంటున్నారు. ఈ ఏడాది చివరిలోగానీ, వచ్చే ఏడాది ఆరంభంలో గాని ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

Larence
Pooja Hegde
kanchana 4
  • Loading...

More Telugu News