Anashwara Rajan: తమిళ .. మలయాళ .. భాషల్లో ఇక చక్రం తిప్పేది వీరే!

- మలయాళంలో దూసుకుపోతున్న అనశ్వర రాజన్
- రీసెంట్ హిట్ గా నిలిచిన 'రేఖా చిత్రం'
- తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అనికా సురేంద్రన్
- లైన్లో ఉన్న పెద్ద ప్రాజెక్టులు
- కాబోయే స్టార్స్ జాబితాలో కనిపిస్తున్న పేర్లు
గతంలో ఎప్పుడూ లేనంత వేగం ఇప్పుడు తమిళ .. మలయాళ భాషా చిత్రాలలో కనిపిస్తోంది. కొత్త కొత్త దర్శకులు రంగంలోకి దిగిపోయి, కంటెంట్ పరంగా .. టెక్నాలజీ పరంగా కథలను పరిగెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ కథానాయికలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతోంది. ఆల్రెడీ పరిచయమైపోయిన బ్యూటీల మార్కెట్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. నిన్నమొన్నటి వరకూ స్టార్ హీరోయిన్స్ వెలిగిన స్థానాల్లోకి యంగ్ బ్యూటీలు వచ్చి చేరిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మలయాళంలో అనశ్వర రాజన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 15వ ఏటనే ఇండస్ట్రీకి వచ్చిన ఈ అమ్మాయి, వరుస సినిమాలతో బిజీ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మమ్ముట్టి - మోహన్ లాల్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించిన అనశ్వర, ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా తన పరుగును పెంచింది. సన్నగా .. నాజూకుగా కనిపించే ఈ అమ్మాయికి ఇప్పుడు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రీసెంటుగా వచ్చిన 'రేఖా చిత్రం' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె కెరియర్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది.
