Nayanthara: తనను లేడీ సూపర్ స్టార్ అనడంపై నయనతార స్పందన

- లేడీ సూపర్‌స్టార్ అని పిలవొద్దని అభిమానులకు సూచించిన నయనతార
- నయనతార పేరే తన హృదయానికి హత్తుకుని ఉందని వ్యాఖ్య
- ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ బిరుదుకు తాను రుణపడి ఉంటానని స ్పష్టీకరణ
ప్రముఖ నటి నయనతార అభిమానులకు ఒక కీలక సూచన చేశారు. తనను లేడీ సూపర్‌స్టార్ అని పిలవవద్దని కోరారు. అభిమానులు ఎంతో ప్రేమతో అలా పిలవడం ఆనందంగా ఉన్నప్పటికీ, నయనతార అనే పేరే హృదయానికి హత్తుకుని ఉందని తెలిపారు. ఆ పేరు నటిగానే కాకుండా వ్యక్తిగా కూడా తనేంటో తెలియజేస్తుందని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
అభిమానులు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞురాలినని నయనతార పేర్కొన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తన విజయంలో, కష్ట సమయంలో అభిమానులు అండగా ఉన్నారని తెలిపారు. ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ బిరుదుకు తాను రుణపడి ఉంటానని, కానీ నయనతార అని పిలిస్తేనే తనకు ఆనందంగా ఉంటుందని చెప్పారు. లేడీ సూపర్‌స్టార్ లాంటి బిరుదులు వెలకట్టలేనివని, అయితే వాటి వల్ల సౌకర్యంగా ఉండలేని పరిస్థితి కూడా ఉంటుందని ఆమె అన్నారు.