Posani Krishna Murali: కేసులు కొట్టేయండి... ఏపీ హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్

Posnai approaches AP High Court

  • పోసానిపై ఏపీలో వరుస కేసులు
  • ఉక్కిరిబిక్కిరి అవుతున్న సినీ నటుడు
  • హైకోర్టును ఆశ్రయించిన వైనం

వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని అర్థించారు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, ఆయా కేసుల్లో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరారు. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు... చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు... ఇలా వివిధ ఆరోపణలతో పోసానిపై ఏపీలో దాదాపు 16 వరకు కేసులు నమోదయ్యాయి. 

తొలుత ఆయనను రాయచోటి పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేయగా, ఆ తర్వాత నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ గుంటూరు జైల్లో ఉన్న ఆయనను ఆదోనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయను గుంటూరు నుంచి ఆదోనికి తరలించినట్టు తెలుస్తోంది.

Posani Krishna Murali
Quash Petition
AP High Court
YSRCP
  • Loading...

More Telugu News