Gutka in Assembly: గుట్కా నమిలి అసెంబ్లీలో ఉమ్మేసిన ఎమ్మెల్యే... స్వచ్ఛందంగా ముందుకు రావాలన్న యూపీ స్పీకర్

కొందరు తాము ప్రజాప్రతినిధులమన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తుంటారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఆ కోవలోకే వస్తాడు. గుట్కా నమిలి అసెంబ్లీ హాల్ లో ఉమ్మేశాడు. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీకి వెళుతుండగా, ద్వారం వద్ద గుట్కా తిని ఊసినట్టుగా కనిపించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన... భద్రతా సిబ్బందిని ఆరా తీయగా... అది ఓ ఎమ్మెల్యే పని అని వెల్లడైంది.
దాంతో, సదరు ఎమ్మెల్యే తనంతట తానే ముందుకు వచ్చి గుట్కా ఊసినట్టు అంగీకరించాలని, లేకపోతే ఆ ఎమ్మెల్యే ఎవరన్నది తానే బయటపెడతానని స్పీకర్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.