Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- 96 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.7 శాతం పతనమైన బజాజ్ ఫిన్ సర్వ్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 96 పాయింట్లు నష్టపోయి 72,989కి పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 22,082 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.02%), జొమాటో (2.45%), టీసీఎస్ (1.03%), అదానీ పోర్ట్స్ (0.63%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.59%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.70%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.40%), నెస్లే ఇండియా (-1.71%), ఏషియన్ పెయింట్ (-1.66%), భారతి ఎయిర్ టెల్ (-1.13%).